విషపూరిత మిథనాల్‌తో నకిలీ శానిటైజర్‌

ABN , First Publish Date - 2020-06-16T10:40:10+05:30 IST

విషపూరిత రసాయనమైన మిథనాల్‌తో తయారు చేసిన శానిటైజర్‌ను ఓ ముఠా

విషపూరిత మిథనాల్‌తో నకిలీ శానిటైజర్‌

హైదరాబాద్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): విషపూరిత రసాయనమైన మిథనాల్‌తో తయారు చేసిన శానిటైజర్‌ను ఓ ముఠా విక్రయిస్తోందని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసులను సీబీఐ అప్రమత్తం చేసింది. అలాగే, పీపీఈ కిట్లు తదితర కరోనా రక్షణ వస్తువుల తయారీ కంపెనీ ప్రతినిధులమంటూ ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థలకు పరిచయం చేసుకుంటున్న మరో ముఠా సభ్యులు.. ఆన్‌లైన్‌ ద్వారా తమ ఖాతాల్లో డబ్బులు వేయించుకుని, ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నారని తెలిపింది. 

Updated Date - 2020-06-16T10:40:10+05:30 IST