హైదరాబాద్ లో నకిలీ డాక్టర్స్ అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-19T22:12:21+05:30 IST

హైదరాబాద్ లో నకిలీ డాక్టర్స్ అరెస్ట్

హైదరాబాద్ లో నకిలీ డాక్టర్స్ అరెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్ లో ఇద్దరు నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫ్ నగర్ లో ఫ్యామిలీ హెల్త్ కేర్ సెంటర్ ను నడుపుతున్న డాక్టర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటర్ ఫెయిలైనా కూడా అబ్దుల్ మజీద్, సాహెబ్ డాక్టర్ అవతారమెత్తారు. డాక్టర్ గా పేరుప్రఖ్యాతులతో పాటు డబ్బులు సంపాదించవచ్చని కేటుగాళ్లు ప్లాన్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. 2017 నుంచి ఆసిఫ్ నగర్ లో సమీర్ ఆస్పత్రి పేరుతో చికిత్స అందిస్తున్నారు. తప్పుడు పత్రాలతో అబ్దుల్ మజీద్, సాహెబ్ డాక్టరేట్ సృష్టించుకున్నారు. 

Updated Date - 2020-07-19T22:12:21+05:30 IST