నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు

ABN , First Publish Date - 2020-12-15T09:20:01+05:30 IST

మహబూబాబాద్‌ జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. స్థానిక శివారు సాలార్‌తండ సమీపంలో ముఠా సభ్యులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.

నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు

నలుగురు అరెస్టు.. రూ.3.50 లక్షల దొంగ నోట్లు స్వాధీనం

మహబూబాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. స్థానిక శివారు సాలార్‌తండ సమీపంలో ముఠా సభ్యులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.50 లక్షల నకిలీ నోట్ల కట్టలు, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న ఏడుగురు పరారీలో ఉన్నారని చెప్పారు.


మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం ఆయన వివరాలను వెల్లడించారు. మరిపెడ మండలం తండ ధర్మారానికి చెందిన గుగులోతు రామకృష్ణ, మహబూబాబాద్‌ శివారు కంకరమిల్లు తండాకు చెందిన ఓర్సు మహేష్‌, గిరిప్రసాద్‌నగర్‌ వాసి ఆకారపు వెంకన్న, నల్గొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగు తండాకు చెందిన దరావత్‌ రాందా్‌సలు వాహానాల తనిఖీ నిర్వహిస్తుండగా పట్టుబడ్డారని తెలిపారు.


Updated Date - 2020-12-15T09:20:01+05:30 IST