ప్రాణమా?.. విశ్వాసమా?..

ABN , First Publish Date - 2020-04-02T01:18:46+05:30 IST

విశ్వాసం.. మనిషికి అదనపు బలాన్ని ఇస్తుంది. నమ్మకం మరింత శక్తిని ఇస్తుంది. కానీ ఈ విశ్వాసం నమ్మకం పరిస్థితుల్ని పట్టించుకోకుండా..

ప్రాణమా?.. విశ్వాసమా?..

హైదరాబాద్: విశ్వాసం.. మనిషికి అదనపు బలాన్ని ఇస్తుంది. నమ్మకం మరింత శక్తిని ఇస్తుంది. కానీ ఈ విశ్వాసం నమ్మకం పరిస్థితుల్ని పట్టించుకోకుండా పరిధిలు దాటితే అనర్ధమే ఎదురవుతోంది. ఇప్పుడు దేశంలో కరోనా విజృంభణ వెనక ఉన్నది ఈ నిర్లక్ష్యమే. ఓ మత సమావేశమే ఇప్పుడు దేశంలో కరోనాను మరో దశకు తీసుకువెళ్తోంది. ఎందుకు చేస్తున్నామో?. ఎలా చేస్తున్నామో తెలియనంత మూఢవిశ్వాసాలకు జనం వెళ్లిపోతున్నారు. బతుకు, బతికించు అనే సర్వమత సారాన్ని మర్చిపోతున్నారు. 


ఇప్పుడు దేశంలో జరిగిన ఒక సామూహిక  మత ప్రార్థన రకరకాల చర్చలకు దారి తీస్తోంది. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కరోనాకు చిన్నా, పెద్దా, మతం అనే తేడా ఉండదు. అయినా కూడా పౌరులు ఇవన్నీ పట్టించుకోకుండా ఎవరి స్టైల్లో వాళ్లు దైవత్వం అంటే సామూహికంగా ప్రార్థించడమా?. లేదా నమ్మకాన్ని వేరే విధంగా అప్లయ్ చేయడాన్ని చూస్తుంటే అసలు దైవత్వం అనే అంశాన్ని సంబంధించిన ఎందుకు విచక్షణ కోల్పోతున్నారు. బతుకు, బతికించు అనే అర్ధాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. మరి ఇలాంటి సమయంలో పౌరుల్లో రావాల్సిన మార్పులేంటి?. 




Updated Date - 2020-04-02T01:18:46+05:30 IST