ప్రత్యేక రైళ్ల సేవల పొడిగింపు
ABN , First Publish Date - 2020-12-15T08:19:39+05:30 IST
పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రకటించిన ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్-

సికింద్రాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రకటించిన ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రత్యేక రైలు జనవరి 1 నుంచి 20 వరకు రోజూ ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.40 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుతుంది.
సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు జనవరి 1 నుంచి 20 వరకు రోజూ మధ్యాహ్నం 2.50 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బయల్దేరి అదే రోజు రాత్రి 8.15కు సికింద్రాబాద్ చేరుతుంది. హైదరాబాద్-జైపూర్ ప్రత్యేక రైలు డిసెంబరు 30 నుంచి జనవరి 18 వరకు సోమ, బుధ వారాల్లో హైదరాబాద్ నుంచి రాత్రి 8.50కు బయల్దేరి రెండో రోజు ఉదయం 5.25కు జైపూర్ చేరుతుంది. జైపూర్-హైదరాబాద్ ప్రత్యేక రైలు జనవరి 1 నుంచి 20 వరకు ప్రతి బుధ, శుక్రవారాల్లో జైపూర్ నుంచి మధ్యాహ్నం 3.20కు బయల్దేరి రెండో రోజు అర్ధరాత్రి 12.45కు హైదరాబాద్ చేరుతుంది. హైదరాబాద్-రక్సోల్ ప్రత్యేక రైలు డిసెంబరు 31 నుంచి జనవరి 14 వరకు హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి 11.10గంటలకు బయల్దేరి రెండో రోజు సాయంత్రం 4.50 గంటలకు రక్సోల్ చేరుతుంది. రక్సోల్- హైదరాబాద్ ప్రత్యేక రైలు రక్సోల్ నుంచి జనవరి 3 నుంచి 17 వరకు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 7.10కు హైదరాబాద్ చేరుతుంది.
నర్సాపూర్-లింగంపల్లి ప్రత్యేక రైలు జనవరి 1 నుంచి 20 వరకు నర్సాపూర్ నుంచి రోజూ సాయంత్రం 6.50కు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.50కు లింగంపల్లి చేరుతుం ది. లింగంపల్లి-నర్సాపూర్ ప్రత్యేక రైలు జనవరి 1 నుంచి 20 వరకు రోజూ రాత్రి 9.05కు లింగంపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.35కు నర్సాపూర్ చేరుతుంది.