60 ప్రత్యేక రైళ్ల సేవల గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-12-01T09:11:02+05:30 IST

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నడుపుతున్న 38 ప్రత్యేక రైళ్లు, జోన్‌ గుండా వెళ్లే మరో 22 ప్రత్యేక రైళ్ల సేవలను మరి కొన్ని రోజుల పాటు పొడిగించారు. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రిజర్వ్‌డ్‌ స్పెషల్‌ ట్రయిన్స్‌ను నడుపుతున్న సంగతి తెలిసిందే. భారతీయ రైల్వే వీటికి గడువు విధించింది

60 ప్రత్యేక రైళ్ల సేవల గడువు పొడిగింపు

తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సర్వీసులు


హైదరాబాద్‌/సికింద్రాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నడుపుతున్న 38 ప్రత్యేక రైళ్లు, జోన్‌ గుండా వెళ్లే మరో 22 ప్రత్యేక రైళ్ల సేవలను మరి కొన్ని రోజుల పాటు పొడిగించారు. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రిజర్వ్‌డ్‌ స్పెషల్‌ ట్రయిన్స్‌ను నడుపుతున్న సంగతి తెలిసిందే. భారతీయ రైల్వే వీటికి గడువు విధించింది. అధిక శాతం రైళ్ల గడువు డిసెంబరు 2కు ముగుస్తుంది. దీంతో డిసెంబరు 2 నుంచి మరింత కాలం పాటు నడపడానికి అనుమతి ఇచ్చింది.


రైల్వే బోర్డు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ రైళ్ల సేవలు కొనసాగిస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా, దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నడుపుతున్న ప్రత్యేక రైళ్లలోని సికింద్రాబాద్‌-గూడూరు రైలు సికింద్రాబాద్‌ నుంచి ప్రతిరోజు రాత్రి 11.05 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.20గంటలకు గూడూరు చేరుతుంది. గూడూరు-సికింద్రాబాద్‌ స్పెషల్‌ రైలు గూడూరు నుంచి ప్రతి రోజు సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌ వస్తుంది. సికింద్రాబాద్‌-ముంబై సీఎ్‌సటీ రైలు ప్రతి రోజు మధ్యాహ్నం 1.25 గం.లకు బయల్దేరి, ఉదయం 7.10గంటలకు ముంబై సీఎ్‌సటీ చేరుతుంది. ముంబై సీఎ్‌సటీ-సికింద్రాబాద్‌ రైలు ప్రతి రోజు రాత్రి 9.30 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 2.40 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.


సికింద్రాబాద్‌-ధనపూర్‌ రైలు ప్రతి రోజు ఉదయం 9.25 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు ధనపూర్‌ చేరుతుంది. ధనపూర్‌-సికింద్రాబాద్‌ రైలు ప్రతి రోజు ధనపూర్‌ నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు బయల్దేరి, రాత్రి 9.30గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌-దర్భంగ బై వీక్లీ రైలు రాత్రి 10.40 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 1.25 గంటలకు దర్భంగ చేరుతుంది.


దర్భంగ-సికింద్రాబాద్‌ బై వీక్లీ రైలు ఉదయం 7.05 గంటలకు బయల్దేరి, రాత్రి 7.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌-రాయిపూర్‌ ట్రై వీక్లీ  రైలు రాత్రి 10.40 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 1.45గంటలకు రాయిపూర్‌ చేరుతుంది. రాయిపూర్‌-సికింద్రాబాద్‌ ట్రైవీక్లీ రైలు సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరి ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. 

Updated Date - 2020-12-01T09:11:02+05:30 IST