ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-10-21T08:49:48+05:30 IST
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకుల జూనియర్ కాలేజీల్లో..

హైదరాబాద్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ప్రవేశాలకు ఈనెల 20 వరకు గడువు ఉండగా.. దీనిని ఈనెలాఖరు(31వతేదీ) వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.