‘అంబేడ్కర్’ వర్సిటీ ప్రవేశాల గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-12-19T07:01:16+05:30 IST
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాల గడువును 31వరకు పొడిగించారు. డిగ్రీ,

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాల గడువును 31వరకు పొడిగించారు. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ఈ నెలాఖరులోపు ప్రవేశాలకు అవకాశం ఉందని రిజిష్ట్రార్ జి.లక్ష్మారెడ్డి శుక్రవారం తెలిపారు. ఇంటర్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీల ద్వారా ఇంటర్ ఉత్తీర్ణులైనవారు, 2016 నుంచి 2020 వరకు వర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షలో పాస్ అయినవారు నేరుగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు.
ఇప్పటికే అడ్మిషన్లు పొంది సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం, పీజీ విద్యార్థులు కూడా నెలాఖరు వరకూ చెల్లించవచ్చని తెలిపారు. బీటెక్, బీఫార్మసీ పూర్తిచేసినవారు సైతం పీజీ కోర్సుల్లో చేరొచ్చని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.