కెమికల్‌ కంపెనీలో పేలుడు

ABN , First Publish Date - 2020-07-28T07:16:38+05:30 IST

హైదరాబాద్‌ బాలానగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రంగారెడ్డినగర్‌ గాంధీనగర్‌ పారిశ్రామికవాడలోని ఓ కెమికల్‌ కంపెనీలో ఆదివారం అర్థరాత్రి

కెమికల్‌ కంపెనీలో పేలుడు

  • నలుగురు కార్మికులకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

బాలానగర్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ బాలానగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రంగారెడ్డినగర్‌ గాంధీనగర్‌ పారిశ్రామికవాడలోని ఓ కెమికల్‌ కంపెనీలో ఆదివారం అర్థరాత్రి పేలుడు సంభవించింది. నలుగురు కార్మికులు గాయపడగా, ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్‌కు అనుసంధానంగా ఉన్న ఎయిర్‌ కండీషనర్‌ వాల్వ్‌లో ఒత్తిడి పెరిగి వాల్‌ ఒక్కసారిగా ఓపెన్‌  కావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి గోడ కూలడంతో పాటు, మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  

Updated Date - 2020-07-28T07:16:38+05:30 IST