మావోయిస్టుల చేతిలో హతమైన భీమేశ్వర్‌రావు కుటుంబానికి రూ. 25 లక్షలు

ABN , First Publish Date - 2020-12-12T04:43:19+05:30 IST

మావోయిస్టుల చేతిలో హతమైన భీమేశ్వర్‌రావు కుటుంబానికి రూ. 25 లక్షలు

మావోయిస్టుల చేతిలో హతమైన భీమేశ్వర్‌రావు కుటుంబానికి రూ. 25 లక్షలు
భీమేశ్వర్‌రావు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేస్తున్న జడ్పీటీసీ, అధికారులు

వెంకటాపురం(నూగూరు), డిసెంబరు 11 : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బోదాపురం గ్రామంలో ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మాడూరి భీమేశ్వర్‌రావు కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలు మంజూరయ్యాయి. శుక్రవారం తహసీల్దార్‌ నాగరాజు, జడ్పీటీసీ పాయం రమణ ఈ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వెంకటాపురం, బీసీమర్రిగూడెం, ఆలుబాక, తుర్సవానిగూడెం సర్పంచులు చిడెం యామిలి, అట్టం సత్యవతి, పూజారి ఆదిలక్ష్మి, కుంజ సూరిబాబు, డిప్యూటీ తహసీల్దార్‌ రాము, టీఆర్‌ఎస్‌ నాయకులు పిళ్లారిశెట్టి మురళి, తోట శ్రీను పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-12T04:43:19+05:30 IST