నేడు ఐసెట్ సీట్ల కేటాయింపు
ABN , First Publish Date - 2020-12-15T12:54:08+05:30 IST
నేడు ఐసెట్ సీట్ల కేటాయింపు
హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారికి సీట్ల కేటాయింపును మంగళవారం ప్రకటించనున్నారు. ప్రవేశాల కోసం మొత్తం 16,800 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి హాజరవ్వగా, 15,067 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. జాబితాను వెబ్‌సైట్లో ప్రకటిస్తామన్నారు.