ఔటర్‌ చుట్టూ అన్నీ

ABN , First Publish Date - 2020-11-19T08:46:17+05:30 IST

నివాస సముదాయాల మధ్య మల్టీస్టార్‌ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, బడులు, కాలేజీలు కొలువుదీరితే?

ఔటర్‌ చుట్టూ అన్నీ

నగర శివార్లలో టౌన్‌షి్‌పలకు ప్రణాళిక..

ఓఆర్‌ఆర్‌ ఆవల 5 కిలోమీటర్ల మేర అభివృద్ధి

 ఇక ‘కాలినడకన పని ప్రదేశానికి’

 ఇళ్లు, బడులు, ఆఫీసులు, హోటళ్లు అక్కడే

 30 మీటర్ల వెడల్పులో రహదారులు

 భూ అభివృద్ధి చార్జీల్లో 90ు మినహాయింపు

 ఐదేళ్ల దాకా పన్ను చెల్లింపుల్లో రాయితీలు

హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నివాస సముదాయాల మధ్య మల్టీస్టార్‌ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, బడులు, కాలేజీలు కొలువుదీరితే? అప్పుడదో చిన్న నగరమే..! ఇలా అన్ని రకాల వసతులు ఒకేచోట ఉండేలా ‘వర్క్‌ టు వాక్‌’ కాన్సె్‌ప్టతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఆవల ఐదు కిలోమీటర్ల దాకా టౌన్‌షి్‌పలను అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోంది.


హైదరాబాద్‌ జనాభా కోటి దాకా చేరడం, జనాభా అంతా ఒకేచోట కేంద్రీకృతం అవడంతో జీహెచ్‌ఎంసీ పరిధి మీద ఉన్న ఒత్తిడిని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఈ మేరకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ల్యాండ్‌పూలింగ్‌ స్కీమ్‌-2017లో భాగంగా ఔటర్‌ వెంట టౌన్‌షి్‌పలను తీసుకొచ్చేందుకు ఓ వైపు హెచ్‌ఎండీఏ ప్రయత్నిస్తుండగా, ప్రైవేటు సంస్థలను కూడా భాగస్వామ్యం చేయడానికి రాయితీలను కల్పిస్తూ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ-2020ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈ పాలసీ అమల్లోకి వచ్చింది.


మలేసియాలో అధ్యయనం

‘వాక్‌ టు వర్క్‌’ కాన్సె్‌ప్టతో అభివృద్ధి చెందిన పలు దేశాల్లో ఇప్పటికే పలు టౌన్‌షి్‌పలు ఏర్పాటయ్యాయి. మలేసియాలోని కౌలాలంపూర్‌ కేఎల్‌ సెంటర్‌ పరిసర ప్రాంతాల్లో వాక్‌ టు వర్క్‌ కాన్సె్‌ప్టతో ఏర్పాటైన ప్రాంతాలను రెండేళ్ల క్రితం హెచ్‌ఎండీఏ, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. అక్కడ ఇళ్లు, కార్యాలయాలు, బడులు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, సినిమా థియేటర్లు అన్నీ ఒకేచోట ఉన్నా యి.


మన దగ్గర కూడా.. ఒకప్పుడు మిథానీ, బీహెచ్‌ఈఎల్‌ వంటి పరిశ్రమల్లో.. పని ప్రదేశానికి కాలినడక(వాక్‌ టు వర్క్‌)న అనే ఆలోచనతో.. ఉద్యోగుల నివాస సముదాయాల నుంచి కార్యాలయాలకు మధ్య దూరాన్ని నిర్ణయించారు.  ఇప్పుడు.. గంట నుంచి గంటన్నర ప్రయాణం తర్వాతే పని ప్రదేశానికి చేరుకునే పరిస్థితి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంతోపాటు.. ‘పని ప్రదేశానికి కాలినడకన’ కాన్సె్‌ప్టను మళ్లీ పరిచయం చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది.


కోకాపేటలో లేఅవుట్‌ సిద్ధం 

కోకాపేటలో హెచ్‌ఎండీఏకు చెందిన సుమారు 500 ఎకరాల్లో వాక్‌ టూ వర్క్‌ కాన్సె్‌ప్టతో టౌన్‌షి్‌పల ఏర్పాటుకు ఇప్పటికే విజన్‌ సిటీ పేరుతో లేఅవుట్‌ను సిద్ధం చేశారు. రోడ్లు, డ్రైనేజీలు, సబ్‌స్టేషన్లు, విద్యుత్తు స్తంభాల ఏర్పాటుకు ఇటీవల టెండర్లు ఆహ్వానించారు. నగర శివారులోని నాలుగు ప్రాంతాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌లో టౌన్‌షి్‌పలను ఏర్పాటు చేసే చర్యలు వేగవంతమయ్యాయి.


ఈ మేరకు యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని దండు మల్కాపురంలో, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని బోగారంలో, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని లేమూరులో, కొత్తూరు మండలం ఇన్మూల్‌ నర్వా గ్రామాల్లో హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌లో భూములిచ్చేందుకు రైతులు అంగీకరించారు.


ట్రాఫిక్‌ జంఝాటాలు లేకుండా

ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షి్‌పలను 100 ఎకరాలకు తగ్గకుండా నిర్మించేలా ప్రభుత్వం నిబంధనలను రూపొందించింది. 300 ఎకరాలలోపు విస్తీర్ణంలో ఉండే టౌన్‌షి్‌పల ప్రధాన రహదారులు కనీసం 30 మీటర్ల వెడల్పుతో ఉండాలని స్పష్టం చేసింది. 300 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే టౌన్‌షి్‌పలకు కచ్చితంగా 36 మీటర్ల వెడల్పుతో రోడ్లను నిర్మించాలి. భవిష్యత్‌లో ఆయా టౌన్‌షి్‌పల పరిధిలో ట్రాఫిక్‌జామ్‌లు ఉండకుండా ఈ నిర్ణయం దోహదపడుతుంది.



పచ్చదనానికి పెద్దపీట

టౌన్‌షి్‌పలలో కనిష్ఠంగా 25ు.. గరిష్ఠంగా 50ు మాత్రమే ప్లాటింగ్‌కు నెట్‌ ఏరియా ఉండాలి. మిగతాదంతా.. రోడ్లు, పచ్చదనం, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, మార్కె ట్లు, పరిశ్రమలు, రవాణా సేవలు, రిక్రియేషన్‌, విద్యాసంస్థలు, హెల్త్‌కేర్‌ యూనిట్లు, ప్రజా అవసరాలకు వదలాల్సి ఉంటుంది. 10% స్థలాన్ని పచ్చదనానికి కేటాయించే డెవలపర్లకు ప్రోత్సాహకాలు ఉంటాయి.


పర్యావరణ మిత్ర నిర్మాణాలను ప్రోత్సహిస్తారు. 50% దాకా ఉండే నెట్‌ ఏరియాలోని ప్లాట్లను విక్రయించేందుకు అనుమతిస్తారు. పదేళ్లలో ఈ తరహా టౌన్‌షి్‌పలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఒకవేళ డెవలపర్లకు తగినంత స్థలం దొరక్కపోతే.. సమీపంలో ఉండే అసైన్‌ భూములను (టౌన్‌షిప్‌ ప్రాజెక్టులో 10% లేదా పది ఎకరాల వరకు) ప్రభుత్వం ఇస్తుంది.  


అన్ని ఆదాయ వర్గాలకు..

 ఇక్కడ ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనకబడిన వర్గం), ఎల్‌ఐజీ (అల్పాదాయ వర్గం), ఎంఐజీ (మధ్యస్త ఆదాయ వర్గం), హెచ్‌ఐజీ (ఉన్నత ఆదాయ వర్గం) పరిధిలోని వారికీ అవకాశాలు ఉంటాయి. ప్రతి టౌన్‌షిప్‌ నిర్వహణకు.. టౌన్‌షిప్‌ రెసిడెంట్స్‌ అండ్‌ యూజర్స్‌ అసోసియేషన్‌ (టీఆర్‌యూఏ)లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.


వర్గాల వారీగా మినహాయింపులు

ఈ టౌన్‌షి్‌పలలో ప్లాట్ల కొనుగోలుదారులకు మినహాయింపులు ఉంటాయి. అన్నివర్గాలకూ భూమి అభివృద్ధి (డెవల్‌పమెంట్‌) చార్జీల్లో 90ు, కాపిటలైజేషన్‌ చార్జీల్లో 100ు% మినహాయింపు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌, ఎల్‌ఐజీ కేటగిరీ కొనుగోలుదారులకు బిల్డప్‌ ఏరియాకు వసూలు చేసే చార్జీల్లో 100%, ఎంఐజీకి 75%, హెచ్‌ఐజీకి 50% మేర వెసులుబాటు ఇస్తారు. ఐదేళ్ల పాటు ఆస్తిపన్ను రాయితీలు ఉంటాయి. 




రాయితీలు.. ప్రధానాంశాలివే!


 90% భూ అభివృద్ధి చార్జీల్లో మినహాయింపు

 5 ఏళ్లు... ఆస్తిపన్ను, పలు ఫీజుల విషయంలో వెసులుబాట్లు. సంయుక్త వినియోగ స్థలాలపై 100ు ఆస్తిపన్ను రాయితీ

 10% పచ్చదనానికి కేటాయించాల్సిన భూమి. ఇలా చేసే టౌన్‌షి్‌పలకు అదనపు మినహాయింపులు ఉంటాయి

 30 మీటర్లు... 100 నుంచి 300 ఎకరాల్లో  టౌన్‌షి్‌పల ప్రధాన రహదారుల వెడల్పు

 36 మీటర్లు... 300 ఎకరాలకు మించిన వి స్తీర్ణముండే టౌన్‌షి్‌పల రహదారుల వెడల్పు

 18 మీటర్లు.. అంతర్గత రహదారుల వెడల్పు


ప్రయోజనాలివీ..!


ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షి్‌పల వల్ల పట్టణ ప్రాంతాలు, నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించడం, ఉద్యోగులు, ప్రజలు తమ అవసరాల కోసం టౌన్‌షి్‌పను దాటి బయట దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం వంటి సౌలభ్యాలు ఉంటాయి. రోడ్లు, తాగునీరు, మురుగునీటి పారుదల, విద్యుత్తు, విద్య, వైద్య సదుపాయా లు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక సౌకర్యాల కల్పనతో మెరుగైన వసతులు ఏర్పడతాయి.

ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షి్‌పలోని ప్రాంతంలో 40శాతం మౌలి క సదుపాయాలకు కాగా, అందులో 10శాతం పచ్చదానం కోసం కేటాయించనున్నారు. ఎక్కువ ఓపెన్‌ స్థలాలు, వాటిలో పచ్చదనం, తక్కువ ట్రాఫిక్‌ సమస్యలు ఉండేట్లుగా చర్యలు తీసుకుంటారు.


Updated Date - 2020-11-19T08:46:17+05:30 IST