అందరికీ సమాన అవకాశమివ్వాలి
ABN , First Publish Date - 2020-11-25T07:55:10+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బస్‌షెల్టర్లు, ప్రజా మరుగుదొడ్లు, మెట్రో పిల్లర్లపై ప్రభుత్వ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బస్‌షెల్టర్లు, ప్రజా మరుగుదొడ్లు, మెట్రో పిల్లర్లపై ప్రభుత్వ/ ప్రైవేటు ప్రకటనలపై సందేహాలు, అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేసింది. ఒప్పంద కాలపరిమితి ముగిసే వరకు ప్రకటన హక్కులు సంబంధిత సంస్థకే ఉంటాయని స్పష్టం చేసింది.
అయితే, ప్రకటనల విషయంలో రాజకీయ పార్టీలు.. అభ్యర్థులకు సమాన అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం ఎల్‌అండ్‌టీ సంస్థకు 36 ఏళ్ల పాటు మెట్రో రైలు నిర్మాణాలపై ప్రకటన హక్కులు ఉంటాయని పేర్కొంది.