ఒక్కొక్కరూ ఒక్కో మొక్క

ABN , First Publish Date - 2020-06-26T07:46:08+05:30 IST

పల్లెలు, పట్టణాలు బాగుండాలంటే ‘ఈచ్‌ వన్‌ - ప్లాంట్‌ వన్‌’ నినాదంతో ప్రతి ఒక్కరూ పూలు, పండ్ల మొక్కలను

ఒక్కొక్కరూ ఒక్కో మొక్క

అప్పుడే ఆకుపచ్చ తెలంగాణ: కేటీఆర్‌


దుండిగల్‌/పద్మారావునగర్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): పల్లెలు, పట్టణాలు బాగుండాలంటే ‘ఈచ్‌ వన్‌ - ప్లాంట్‌ వన్‌’ నినాదంతో ప్రతి ఒక్కరూ పూలు, పండ్ల మొక్కలను ఇళ్లలో, వీధుల్లో పెంచుకోవాలని మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు ఆకుపచ్చ, ఆదర్శ తెలంగాణ అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దుండిగల్‌ మునిసిపాలిటీ పరిధిలోని 110 ఎకరాల హెచ్‌ఎండీఏ స్థలాన్ని యాదాద్రి(మియావాకి) తరహాలో చిట్టడవిగా మార్చనున్నట్లు ప్రకటించారు. ఓఆర్‌ఆర్‌లోని దుండిగల్‌ ఎగ్జిట్‌ 5 వద్ద గురువారం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మొక్కలు నాటారు. అనంతరం, హెచ్‌ఎండీఏ రూపొందించిన హరితహారం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 12.5 కోట్ల మొక్కలను పెంచబోతున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2020-06-26T07:46:08+05:30 IST