వానాకాలంలో ప్రతి పంటా రికార్డు కావాలి

ABN , First Publish Date - 2020-06-04T08:51:28+05:30 IST

వానాకాలంలో వేసే ప్రతి పంటా రికార్డు కావాలని అధికారులను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. నేలల వర్గీకరణ చేయాలని, ఆయా నేలల్లో పండే

వానాకాలంలో ప్రతి పంటా రికార్డు కావాలి

వానాకాలంలో వేసే ప్రతి పంటా రికార్డు కావాలని అధికారులను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. నేలల వర్గీకరణ చేయాలని, ఆయా నేలల్లో పండే అనుకూలమైన పంటలను గుర్తించాలని చెప్పారు. రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంరద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సమగ్ర వ్యవసాయ విధానం మీద బుధవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో అధికారులతో నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని తెలిపారు.  సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ను ముఖ్య గణాంకాల అధికారిగా  విజయకుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. 

Updated Date - 2020-06-04T08:51:28+05:30 IST