న్యూ ఇయర్‌ వేడుకలకు కస్టమర్లను ఆకర్షిస్తున్న ఈవెంట్‌ ఆర్గనైజర్లు

ABN , First Publish Date - 2020-12-30T22:22:03+05:30 IST

న్యూ ఇయర్‌ వేడుకలకు కస్టమర్లను ఈవెంట్‌ ఆర్గనైజర్లు ఆకర్షిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఈవెంట్లకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు

న్యూ ఇయర్‌ వేడుకలకు కస్టమర్లను ఆకర్షిస్తున్న ఈవెంట్‌ ఆర్గనైజర్లు

హైదరాబాద్: న్యూ ఇయర్‌ వేడుకలకు కస్టమర్లను ఈవెంట్‌ ఆర్గనైజర్లు ఆకర్షిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఈవెంట్లకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ ఈవెంట్‌ ఆర్గనైజర్లు తమ వ్యాపారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేసుకుపోతున్నారు. వినియోగదారులకు రహస్యం ఫోన్ ద్వారా ఈవెంట్ సమాచారాన్ని అందిస్తున్నారు. ఈవెంట్‌ ఆర్గనైజర్ల కాల్‌ రికార్డులు ఏబీఎన్‌ చేతికి చిక్కాయి. రెగ్యులర్ కస్టమర్లకు కాల్ చేసి ఈవెంట్లపై సమాచారాన్ని ఆర్గనైజర్లు ఇస్తున్నట్లు ఏబీఎన్ పరిశోదనలో తేలింది. రిఫరెన్స్‌ ఉంటేనే ఈవెంట్‌లోకి అనుమతి అంటూ కస్టమర్లకు వల వేస్తున్నారు. జంటగా వస్తే ఒక రేటు, సింగిల్ పర్సన్ అయితే మరో రేటుగా ఫిక్స్ చేశారు. ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు

Updated Date - 2020-12-30T22:22:03+05:30 IST