వైద్య అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ అత్యవసర భేటీ
ABN , First Publish Date - 2020-03-02T22:00:16+05:30 IST
వైద్య అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ అత్యవసర భేటీ

హైదరాబాద్: నగరంలోని కోఠిలో అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ అత్యవసర భేటీ అయ్యారు. అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆయన సమావేశమైయ్యారు. కరోనా సోకిన వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై మంత్రి చర్చిస్తున్నారు. కాగా ఆదివారం రోజున దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐదుగురికి కోవిడ్-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్‌గా తేలగా.. మరొకరికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. వీరిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.