డయాలసిస్‌ రోగికి ఏడాదికి రూ. 1.80 లక్షలు ఖర్చు: ఈటల

ABN , First Publish Date - 2020-03-12T10:09:08+05:30 IST

రాష్ట్రంలో ఒక్కో డయాలసిస్‌ రోగి రక్తాన్ని శుద్ధి చేయడానికి సర్కారు ప్రతీ ఏట రూ. 1.80 లక్షల ఖర్చు చేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో 45 కేంద్రాల్లో డయాలసిస్‌ సేవలందిస్తున్నామని

డయాలసిస్‌ రోగికి ఏడాదికి రూ. 1.80 లక్షలు ఖర్చు: ఈటల

రాష్ట్రంలో ఒక్కో డయాలసిస్‌ రోగి రక్తాన్ని శుద్ధి చేయడానికి సర్కారు ప్రతీ ఏట రూ. 1.80 లక్షల ఖర్చు చేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో 45 కేంద్రాల్లో డయాలసిస్‌ సేవలందిస్తున్నామని, అవసరమైతే ఈ కేంద్రాలను పెంచుతామని శాసన మండలిలో చెప్పారు. రాష్ట్రంలో 10 వేలమందికి పైగా డయాలసిస్‌ రోగులు ఉన్నారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌ ప్రొఫైల్‌ రూపకల్పన ప్రారంభిస్తామన్నారు.  

Updated Date - 2020-03-12T10:09:08+05:30 IST