నిత్యావసరాల సరుకులతో బయల్దేరివెళ్లిన రైలు

ABN , First Publish Date - 2020-04-06T01:49:23+05:30 IST

కోవిడ్ 19 మహమ్మారి కట్టడిలో భాగంగా అన్ని రైళ్లను రద్దు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నిత్యావస సరుకుల రవాణాకు ..

నిత్యావసరాల సరుకులతో బయల్దేరివెళ్లిన  రైలు

హైదరాబాద్: కోవిడ్ 19 మహమ్మారి కట్టడిలో భాగంగా అన్ని రైళ్లను రద్దు  చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నిత్యావస సరుకుల రవాణాకు ఎటువంటి అంతరాయం కలుగకుండదనే ఉద్దేశంతో దేశంలోని పలు నగరాలకు ప్రత్యేక పార్క్ ఎక్క్ ప్రెస్ రైళ్లను ప్రారంభించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. దీనిలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన సికింద్రాబాద్ నుంచి హౌరాకు, ఖాజీపేట, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి మీదుగా ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు బయల్దేరి వెళ్లింది. 


ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో నిత్యావసర సరుకులు రవాణా ఆగకూడదనే ఉద్దేశంతో రైల్వే అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వ్యాపారులు ప్రధాన సామాగ్రి సరఫరా దారులు సరుకులు సరఫరా చేయడంలో సమన్వయంతో వ్యవహరించారు. సరుకులు ఎలాంటి అంతరాయం లేకుండా గమ్యానికి చేరేందుకు రైల్వే సిబ్బంది స్థానిక ప్రభుత్వాలు పోలీస్ శాఖ సహకారం కూడా తీసుకున్నారు. 

Updated Date - 2020-04-06T01:49:23+05:30 IST