ఈఎస్ఐ కేసులో వాస్తవిక నివేదిక కోరాం: కేంద్రం
ABN , First Publish Date - 2020-03-24T10:34:00+05:30 IST
తెలంగాణలో ఈఎ్‌సఐ డిస్పెన్సరీ మందుల కొనుగోళ్లలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాస్తవిక నివేదిక కోరామని కేంద్రం తెలిపింది. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు

న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఈఎ్‌సఐ డిస్పెన్సరీ మందుల కొనుగోళ్లలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాస్తవిక నివేదిక కోరామని కేంద్రం తెలిపింది. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఈ మేరకు సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అవకతవకలు జరిగినట్లు ఆయా పత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.