ఈ-సంజీవని సేవలకు ప్రాచుర్యం కల్పించాలి
ABN , First Publish Date - 2020-11-03T08:07:00+05:30 IST
ఈ-సంజీవని ద్వారా అందించే ఉచిత టెలిమెడిసిన్ సేవలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. జాతీయ
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఈ-సంజీవని ద్వారా అందించే ఉచిత టెలిమెడిసిన్ సేవలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. జాతీయ టెలీ కన్సల్టేషన్ సర్వీసులో భాగంగా టెలీ కన్సల్టేషన్ సేవలను మెరుగుపరచడం ఎలా అనే అంశంపై సోమవారం జరిగిన వెబినార్‌లో గవర్నర్ మాట్లాడారు. ఉచిత ఆన్‌లైన్ ఓపీడీ(ఔట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్) సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
కరోనా వల్ల క్లినిక్‌లతో పాటు ఆస్పత్రుల్లో ఔట్‌పేషెంట్ సేవలు నిలుపుదల చేసినందున ఇంటినుంచే సురక్షితమైన పద్ధతుల్లో వైద్యసేవలు పొందడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ భాటి యా, ఈ-సంజీవని ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సంజయ్‌సూద్ తదితరులు పాల్గొన్నారు.