కరోనా ఎఫెక్ట్.. ఎర్రగడ్డలో కూరగాయలు లూటీ

ABN , First Publish Date - 2020-03-23T23:51:50+05:30 IST

రోనా నేపథ్యంలో మార్కెట్లలో కూరగాయల ధరలు భారీగా పెంచేశారు.

కరోనా ఎఫెక్ట్.. ఎర్రగడ్డలో కూరగాయలు లూటీ

హైదరాబాద్‌ : కరోనా నేపథ్యంలో మార్కెట్లలో కూరగాయల ధరలు భారీగా పెంచేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్‌లో కూరగాయల రేట్లు పెంచేయడం.. పదుల రేట్లలోని కిలో కూరగాయాలు వంద రూపాయలకు పైగా పెంచేయడంతో వినియోగ దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ క్రమంలో ఎక్కువ ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై వినియోగదారులు దాడికి దిగారు. మరోవైపు దీన్నే అదనుగా చేసుకున్న వినియోగదారులు ఎక్కడికక్కడ అందినకాడికి కూరగాయలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారంపై వ్యాపారులు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-03-23T23:51:50+05:30 IST