మాస్క్‌లు లేని వారిని బస్సుల్లో అనుమతించ వద్దు- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-06-01T21:04:46+05:30 IST

కరోనా వైరస్‌ విస్తృతం అవుతున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడమే కాకుండా అధికారులు సైతం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆదేశించారు.

మాస్క్‌లు లేని వారిని బస్సుల్లో అనుమతించ వద్దు- ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌: కరోనా వైరస్‌ విస్తృతం అవుతున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడమే కాకుండా అధికారులు సైతం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆదేశించారు. ప్రత్యేకించి బస్సులు ప్రయాణాల్లో మాస్క్‌లు లేని వారిని అనుమతించ వద్దన్నారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత కార్య క్రమంలో భాగంగా సోమవారం వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలో మురికి కాలువలను మంత్రి పరిశీలించారు. 


ఈసందర్భంగా మురికికాలువల నిర్వహణ మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని సర్పంచ్‌, గ్రామ కార్యదర్శి, సిబ్బందిని ఆదేశించారు. కాలువలు శుభ్రంగా లేక పోతే దోమలు, దుర్గందం పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రబలే ప్రమాదం ఉందన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి ఆర్టీసీ బస్సును తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్సుల్లోనూ పరిశుభ్రతను పాటించాలన్నారు. అనంతరం గ్రామంలోని ధాన్యం సేకరణ కేంద్రాన్ని కూడా మంత్రి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 8వ తేదీ వరకూ ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌తో మాట్లాడి ధాన్యం కొనుగోలు నిర్ణీత గడవులో పూర్తయ్యేలా చూడాలన్నారు. 

Updated Date - 2020-06-01T21:04:46+05:30 IST