మన పథకాలతో కేంద్రానికి కళ్లమంట: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-10-01T08:32:29+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలను చూసి కేంద్ర ప్రభుత్వానికి కళ్లు మండుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు....

మన పథకాలతో కేంద్రానికి కళ్లమంట: ఎర్రబెల్లి

వర్ధన్నపేట, సెప్టెంబరు 30: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలను చూసి కేంద్ర ప్రభుత్వానికి కళ్లు మండుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేటలో బుధవారం సీఎం కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టం అమలు చేయడాన్ని హర్షిస్తూ రైతులు 1000 ట్రాక్టర్లతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేలా రూపొందించిన వ్యవసాయ, విద్యుత్తు బిల్లులను తమ పార్టీ పార్లమెంట్‌లో వ్యతిరేకించడంతో పాటు వ్యతిరేకంగా ఓటు వేసిందన్నారు. విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించి మీటర్లు బిగించినట్లయితే ఒక మోటార్‌కు ఏడాదికి రూ.1.10లక్షల బిల్లు వస్తుందని తెలిపారు. 

Updated Date - 2020-10-01T08:32:29+05:30 IST