గృహప్రవేశం చేయించి..పాలుపొంగేదాకా ఉండి

ABN , First Publish Date - 2020-12-11T07:50:06+05:30 IST

సిద్దిపేట శివారులోని నర్సాపూర్‌లో నిర్మించిన 2460 డబుల్‌ బెడ్రూం ఇళ్ల కాలనీలో ఏర్పాటు చేసిన

గృహప్రవేశం చేయించి..పాలుపొంగేదాకా ఉండి

 సిద్దిపేట శివారులోని నర్సాపూర్‌లో నిర్మించిన 2460 డబుల్‌ బెడ్రూం ఇళ్ల కాలనీలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కాలనీకి కేసీఆర్‌ నగర్‌గా నామకరణం చేశారు. అనంతరం కాలనీ అంతా సీఎం కలియతిరిగారు.

స్వాతి అనే లబ్ధిదారు ఇంటికి వెళ్లి గృహప్రవేశం చేయించారు. వారింట్లో తిరిగి పాలుపొంగించే దాకా అక్కడే ఉన్నారు. మరికొన్ని ఇళ్లనూ సందర్శించారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వసతులు బాగున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో 9వ బ్లాక్‌కు చేరుకోగానే కేసీఆర్‌పై లబ్ధిదారులు పూలవర్షం కురిపించారు. 


Updated Date - 2020-12-11T07:50:06+05:30 IST