ఇంజనీర్లతోనే ఆధునిక ఆలయాలు

ABN , First Publish Date - 2020-09-16T20:41:59+05:30 IST

ఆధునిక ఆలయాలు అనదగ్గ సాగు, తాగునీటి ప్రాజెక్టులను జాతికి అందించిన మహనీయులు ఇంజనీర్లని, తమ ప్రజ్ఞతో జన బాహుళ్య కళ్యాణానికి ఇంజనీర్లు దోహదం చేస్తున్నారని తెలంగాణ పద్మశాలి అపీషియల్స్‌, ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్‌ అన్నారు.

ఇంజనీర్లతోనే ఆధునిక ఆలయాలు

హైదరాబాద్‌: ఆధునిక ఆలయాలు అనదగ్గ సాగు, తాగునీటి ప్రాజెక్టులను జాతికి అందించిన మహనీయులు ఇంజనీర్లని, తమ ప్రజ్ఞతో జన బాహుళ్య కళ్యాణానికి ఇంజనీర్లు దోహదం చేస్తున్నారని తెలంగాణ పద్మశాలి అపీషియల్స్‌, ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్‌ అన్నారు. బహుళార్ధ సాధకంగా ఉపయోగపడుతున్న ఇంజనీర్లే దేశాభివృద్ధికి జవసత్వాలని వారి కృషి అభినందనీయమని అన్నారు. ఇంజనీర్స్‌ డే పురస్కరించుకుని పలువురు ఇంజనీర్లకు అసోసియేషన్‌ తరపున సన్మానించారు. ఈసందర్భంగా రఘునందన్‌ మాట్లాడుతూ వృత్తివిద్యలో అవసరమైన నైపుణ్యాన్ని రంగరించి అద్భులాలను ఆవిష్కరించగల సత్తా ఇంజనీర్లకే ఉందన్నారు దేశ ప్రగతి ఇంజనీరింగ్‌ ప్రజ్ఞతో ప్రభావితం  అవుతోందని తెలిపారు. తాగు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్‌, గాలి మరలు, ఇలా ఎన్నెన్నో రంగాల్లో కొంగొత్త ఆవిష్కరణలతో ప్రపంచంలోనే భారత దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేస్తున్నఘనత ఇంజనీరింగ్‌ దే అన్నారు. అందుకే ఇప్పటికీ సర్‌ఆర్ధర్‌ కాటన్‌ , మోక్షగుండం విశ్వేశ్వరయ్యలను ప్రజలు స్మరించుకుంటున్నారని అన్నారు. 

Updated Date - 2020-09-16T20:41:59+05:30 IST