ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నాం- మంత్రి నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-03-12T21:23:25+05:30 IST

తెలంగాణ ఆయిల్‌పామ్‌ సాగుకు ఎంతో అనుకూలమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నాం- మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ఆయిల్‌పామ్‌ సాగుకు ఎంతో అనుకూలమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి రైతాంగాన్ని సాగువైపు ప్రోత్సహిస్తున్నామని అన్నారు. శాసన సభలో ఎమ్మెల్యేలు బాల్కసుమన్‌, ఆలవెంకటేశ్వరరెడ్డి, సండ్ర వెంకటవీరయ్య , భాస్కరరావు ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగును ప్రహిస్తున్నది నిజమేనా?అని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రైతులకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌  కల్పించారని, ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తెలంగాణ ప్రజా ప్రతినిధులు చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుకు తెలంగాణ అనకూలమని కేంద్ర కమిటీ నిర్ధారించింది. 2.78 లక్షల హెక్టార్లు అనుకూలమని కేంద్ర కమిటీ తేల్చిందని చెప్పారు. 


తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న కరువు పరిస్థితులలో ఇది అనుకూలం కాదని అనుకున్నాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత మారిన పరిస్థితులు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలంగా ఉన్నాయని కేంద్ర బృందం తేల్చిందని అన్నారు. ఇతర పంటలతో పాటు ఆయిల్‌పామ్‌ సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని, రైతుకు పంట తరలింపునకు రవాణా ఖర్చులు చెల్లిస్తున్న ఏకైక పంట ఆయిల్‌పామ్‌ అని వెల్లడించారు. పలు జిల్లాల రైతులకు ఇప్పటికే అవగాహనా సదస్సులతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తయినట్టు తెలిపారు. దేశంలో 130 కోట్ల ప్రజలు ఏడాదికి 21మిలియన్‌ టన్నుల వివిధ రకాల నూనెలను వినియోగిస్తున్నారని తెలిపారు.రూ.75వేల కోట్ల రూపాయల విలువైన నూనెలను మనదేశం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.తెలంగాణ ముందుచూపు చూసికేంద్రం 18,100 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగుకు తాజాగా అనుమతించిందని అన్నారు. ఆయిల్‌పామ్‌ టన్నుకు 16వేలు ధర పలుకుతోందన్నారు. హెక్టారుకు 25 నుంచి 30 టన్నుల దిగుమతి వస్తుందన్నారు. ఆయిల్‌పామ్‌ గిట్టుబాటు ధర విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట ఎంత పెరిగితే విదేశాల నుంచి దిగుమతులు అంతగా తగ్గిపోతాయని అన్నారు. 

Updated Date - 2020-03-12T21:23:25+05:30 IST