ఉపాధి హామీ పనుల కూలీ ఇక రూ. 237
ABN , First Publish Date - 2020-04-28T09:52:39+05:30 IST
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీ రేట్లను సవరించారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో కూలీరేటు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీ రేట్లను సవరించారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో కూలీరేటు రూ.211గా ఉంది. 2020-21 సంవత్సరానికిగాను దీన్ని రూ.237కు పెంచారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.