డిజిటల్ సర్వేలో 5 వేల మందికి ఉపాధి: టీటా
ABN , First Publish Date - 2020-10-04T08:13:07+05:30 IST
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏడో డిజిటల్ ఆర్థిక సర్వేలో ఎన్యుమరేటర్లుగా దాదాపు ఐదు ..
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏడో డిజిటల్ ఆర్థిక సర్వేలో ఎన్యుమరేటర్లుగా దాదాపు ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను టీటా అధ్యక్షుడు సందీప్ మక్తాల శనివారం విడుదల చేసి మాట్లాడారు. ఎన్యుమరేటర్ల నియామకం చేపడుతున్నామని.. వివరాలకు 63003 68705, 95428 09069 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.