తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి... కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి
ABN , First Publish Date - 2020-07-30T23:31:31+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తోన్న కూలీలను హఠాత్తుగా తొలగించడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. ఈ కూలీలంతా గత పధ్నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వారిని ఏకపక్షంగా తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తోన్నఫీల్డ్ అసిస్టెంట్లను హఠాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. ఈ ఉద్యోగులంతా గత పధ్నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వారిని ఏకపక్షంగా తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయం నేపధ్యంలో... మొత్తం 7,714 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఉపాధిని కోల్పోయారని హర్షవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆ ఉద్యోగులను తొలగిస్తూ... ఈ నెల 27 వ తేదీన జారీ చేసిన 4779 నంబర్ సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో... ఆ ఉద్యోగులు ఆందోళనబాట పడతారని హెచ్చరించారు. ఇందుకు తమ పార్టీ కూడా మద్దతునిస్తుందని వెల్లడించారు. లక్షల ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన టీఆర్‌ఎస్... అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని హర్షవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.