ఉపాధి కూలీలకు 75% జీతమివ్వాలి: సంపత్
ABN , First Publish Date - 2020-04-25T09:33:31+05:30 IST
ఉపాధి హామీ కూలీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ కూలీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. కార్పొరేటు కంపెనీలే కార్యాలయాలను మూసేసి ఉద్యోగులకు కొంత మేరకు వేతనాలు ఇస్తుంటే.. ఉపాధి కూలీలను మాత్రం పనిచేయాలని చెబుతున్నారని మండిపడ్డారు. జాబ్ కార్డు ఉన్నవారి కుటుంబాలను ఆదుకునేందుకు వంద రోజుల పని దినాల కూలీలో 75 శాతం వేతనం ఇవ్వాలని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.