ఎంసెట్‌ హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టాం: ఎంసెట్ కన్వీనర్

ABN , First Publish Date - 2020-09-03T19:52:35+05:30 IST

హైదరాబాద్: ఎంసెట్‌ హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టామని ఎంసెట్ కన్వీనర్ గోవర్దన్‌ తెలిపారు.

ఎంసెట్‌ హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టాం: ఎంసెట్ కన్వీనర్

హైదరాబాద్: ఎంసెట్‌ హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టామని ఎంసెట్ కన్వీనర్ గోవర్దన్‌ తెలిపారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. eamcet.tsche.ac.in నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 7వ తేదీవరకు హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం ఉంటుందన్నారు. ఈనెల 9, 10, 11, 14 తేదీల్లో రెండు సెషన్లలో ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు గోవర్దన్ తెలిపారు. ఉదయం 9 నుంచి 12 వరకు తొలి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి 6వరకు రెండో సెషన్‌ ఉంటుందని వెల్లడించారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో ఎంసెట్‌ పరీక్ష జరుగుతుందన్నారు. అక్టోబర్‌ మూడో వారంలో కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తామని ఏబీఎన్‌‌కు గోవర్దన్ వివరించారు.


Updated Date - 2020-09-03T19:52:35+05:30 IST