ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ చెక్
ABN , First Publish Date - 2020-10-08T03:47:43+05:30 IST
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెడుతోంది. కాంగ్రెస్‌లో..

కామారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెడుతోంది. కాంగ్రెస్‌లో ఉన్న 12 మంది కౌన్సిలర్లు టీఆర్ఎస్‌లోకి జంప్ అవుతారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థి సొంత నియోజకవర్గంలోనే కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు షాక్ ఇవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ముగ్గురికి ముగ్గురు పార్టీ మారడంతో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయనుంది.