జస్టిస్‌ ధర్మాధికారిపై ఉద్యోగ సంఘాల భగ్గు

ABN , First Publish Date - 2020-03-13T10:12:31+05:30 IST

విద్యుత్తు ఉద్యోగుల విభజనపై జస్టిస్‌ డీఎం ధర్మాధికారి తాజా నిర్ణయంపై ఉద్యోగసంఘాలు భగ్గుమన్నాయి. 655 మందిని ఏపీకి కేటాయించినందున.. ఏపీ నుంచీ 655 మంది ఉద్యోగులను తెలంగాణకు

జస్టిస్‌ ధర్మాధికారిపై ఉద్యోగ సంఘాల భగ్గు

హైదరాబాద్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు ఉద్యోగుల విభజనపై జస్టిస్‌ డీఎం ధర్మాధికారి తాజా నిర్ణయంపై ఉద్యోగసంఘాలు భగ్గుమన్నాయి. 655 మందిని ఏపీకి కేటాయించినందున.. ఏపీ నుంచీ 655 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపించాలన్న ధర్మాఽధికారి నివేదికపై గురువారం సమావేశమయ్యాయి. 2015లో ఏపీ నుంచి సెల్ఫ్‌ రిలీవ్‌ అయి తెలంగాణలో పనిచేస్తున్న 229 పోస్టులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించాయి. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం వచ్చే ఉద్యోగులను మాత్రమే చేర్చుకోవాలని విద్యుత్తు సంస్థలను డిమాండ్‌ చేశాయి.  ధర్మాధికారి నివేదిక ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ ్వబోమని తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.  సంఘం కార్యవర్గం అత్యవసరంగా సమావేశమైంది. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేసే విధంగా ఈ నివేదిక ఉందని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రత్నాకర్‌రావు, సదానందం అన్నారు. ఏపీలో ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా జరిగిన కేటాయింపులను అడ్డుకోవాలని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును కలిసి నివేదించారు.  కాగా, ఉద్యోగుల విభజన అంశంపై సుప్రీంకోర్టులో వివరణ వ్యాజ్యం దాఖలు చేయాలని తెలంగాణ విద్యుత్తు సంస్థలు నిర్ణయించాయి.


సమస్య మళ్లీ మొదటికే

విద్యుత్తు ఉద్యోగుల విభజన వివాదం ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. 2015లో ఏపీ స్థానికత కలిగిన 1,157మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్తు సంస్థలు రిలీవ్‌ చేయగా వారు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం కోర్టు ఆదేశాలతో ఈ 1,157 మంది ఉద్యోగులు తాము ఎక్కడికి వెళ్లదల్చుకున్నా రో అప్షన్లు ఇచ్చారు. అయితే ఏపీకి వెళ్తామని ఆప్ష న్లు ఇచ్చినవారితో పాటు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వని 655 మందిని కూడా ఇటీవల ఏపీకి కేటాయించారు. 502 మందితో పాటు నాలుగున్నరేళ్ల కిందట ఏపీ నుంచి సెల్ఫ్‌ రిలీవ్‌(తమకు తామే రిలీవ్‌) అయి వచ్చిన 229 మందితో కలుపుకొని 731 మందిని తెలంగాణకు కేటాయించారు. తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఈ 731 మందికి పోస్టింగులు కూడా ఇచ్చేశాయి. అయితే 655 మందిని చేర్చుకోవడానికి ఏపీ నిరాకరించింది. ఈ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ డీఎం ధర్మాధికారి కమిటీ రెండు రాష్ట్రాల విద్యుత్తు సంస్థలతో చర్చలు జరిపారు. తాజా నిర్ణయంతో ఉద్యోగుల విభజన సమస్య కొలిక్కి రాకపోగా మళ్లీ మొదటికొ చ్చిందని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.

Updated Date - 2020-03-13T10:12:31+05:30 IST