మార్చి వినియోగానికి యావరేజ్ చార్జి
ABN , First Publish Date - 2020-04-08T08:54:29+05:30 IST
లాక్‌డౌన్‌తో మీటర్ రీడింగ్ తీయరాదని నిర్ణయం తీసుకోవడంతో మార్చి నెల వినియోగానికి సంబంధించి యావరేజ్ బిల్లింగ్ విధానాన్ని అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు...

- లాక్ డౌన్ ఎత్తేయగానే పూర్తి బిల్లు
- ఎస్ఎంఎస్ ద్వారా విద్యుత్తు బిల్లుల జారీ
- డిస్కంలకు టీఎ్సఈఆర్సీ ఆదేశాలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌తో మీటర్ రీడింగ్ తీయరాదని నిర్ణయం తీసుకోవడంతో మార్చి నెల వినియోగానికి సంబంధించి యావరేజ్ బిల్లింగ్ విధానాన్ని అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎ్సఈఆర్సీ) డిస్కంలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. యావరేజ్ బిల్లింగ్‌పై ఉత్తర్వులివ్వాలని కోరుతూ డిస్కంలు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఈఆర్సీ.. మంగళవారం ఆదేశాలిచ్చింది. లాక్డౌన్ ఎత్తేయగానే రీడింగ్ తీసి వినియోగదారులకు సమగ్ర బిల్లు ఇవ్వాలని నిర్దేశించింది. ఇక బిల్లుల వసూళ్ల కోసం వినియోగదారులపై ఒత్తిడి తేరాదని, చెల్లింపులు ఆలస్యమైనప్పటికీ ఆలస్య రుసుము వసూలు చేయరాదని నిర్దేశించింది. తాజా ఆదేశాలతో బుధవారం నుంచి ఎస్ఎంఎ్స/మొబైల్ యాప్/వెబ్సైట్ ఆధారంగా బిల్లులను పంపనున్నారు. వీటిని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీ సీఎల్ వెబ్సైట్లు లేదా మొబైల్యా్పల వంటి ఆన్లైన్ పద్ధతుల ద్వారా చెల్లించవచ్చు.
ఎవరెవరికి ఎంత బిల్లంటే...
- ఎల్టీ(లోటెన్షన్)-1 డొమెస్టిక్, ఎల్టీ-6(ఏ) స్ట్రీట్ లైటింగ్, ఎల్టీ-6(బీ) రక్షిత నీటి సరఫరా పథకం వినియోగదారులకు 2019 మార్చిలో ఏ బిల్లు వేశారో అదే బిల్లు వేస్తారు.
- ఎల్టీ(లోటెన్షన్)-1 డొమెస్టిక్, ఎల్టీ-6(ఏ) స్ట్రీట్ లైటింగ్, ఎల్టీ-6(బీ) రక్షిత నీటి సరఫరా పథకం వినియోగదారులైతే వారికి 1-4-2019 నుంచి 29-2-2020 తర్వాత కనెక్షన్ ఇస్తే వారికి 2020 మార్చిలో ఇచ్చిన బిల్లు ఇవ్వాలి.
- ఎల్టీ(లోటెన్షన్)-1 డొమెస్టిక్, ఎల్టీ-6(ఏ) స్ట్రీట్ లైటింగ్, ఎల్టీ-6(బీ) రక్షిత నీటి సరఫరా పథకం వినియోగదారులైతే వారికి మార్చి-2020 తర్వాత కనెక్షన్ ఇస్తే కనీస బిల్లు వేయాలి.
- ఎల్టీ కేటగిరిలోని ఎల్-1 కాకుండా ఇతర వినియోగదారులందరికీ 2019 ఏప్రిల్‌లో ఎంత బిల్లు వచ్చిందో... ఆ బిల్లులో 50ు మాత్రమే వేయాలి. లాక్డౌన్ సందర్భంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేయడంతో వాటి వినియోగం కూడా తగ్గుముఖం పట్టిన కారణంగా 50 శాతాన్ని ఖరారు చేశారు.
- ఎల్‌టీలోని ఇతర అన్ని కేటగిరీల వినియోగదారులకు వారి కనెక్షన్‌ను 1-4-2019 నుంచి 29-2-2020 మధ్య మంజూరు చేస్తే.. వారికి మార్చి నెలలో ఎంత వినియోగం ఉందో, అందులో 50ు మాత్రమే బిల్లు వేయాలి.
- ఎల్‌టీలోని ఇతర వినియోగదారులకు వారి కనెక్షన్‌ను మార్చి-2020లో విడుదల చేస్తే.. వారికి కనీస వినియోగాన్ని ప్రామాణికం చేసుకోవాలి.