ప్రతి నెలా విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సిందే

ABN , First Publish Date - 2020-08-01T07:18:28+05:30 IST

ప్రతి నెలా విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సిందే

ప్రతి నెలా విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సిందే

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు ప్రతి నెలా తప్పని సరిగా విద్యుత్తు బిల్లులు చెల్లించాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. మీటరు రీడింగ్‌ ఆధారంగానే బిల్లులు ఉండాలని, అవసరమైన చోట నెల రోజుల్లోగానే మీటర్లు బిగించాలని ఆదేశించారు. పంచాయతీలు, మునిసిపాలిటీల పెండింగ్‌ విద్యుత్తు బిల్లుల అంశంపై శుక్రవారం బీఆర్‌కే భ వన్‌లో సంబంధిత శాఖల ఉన్నతాఽధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్తు బిల్లుల బకాయిల విషయమై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల నుంచి రావాల్సిన బకాయిలపై వారం రోజుల్లోగా నివేదిక అందించాలని సూచించారు.

Updated Date - 2020-08-01T07:18:28+05:30 IST