తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరుగుదల

ABN , First Publish Date - 2020-08-12T03:32:02+05:30 IST

కార్బన్ ఉద్గారాలు విడుదల చేసే వాహనాల విక్రయంపై ప్రజలకు ఆసక్తి తగ్గుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కిందటి సంవత్సరంతో పోలిస్తే 2020 లో ఈ ఎనిమిది నెలల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 23 శాతం పెరిగాయి. రవాణా శాఖ వివరాల ప్రకారం ఈ నెల ఆరవ తేదీ నాటికి 11 వేల ఎలక్ట్రిక్, బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు రోడ్డు మీదకు వచ్చాయి. ఇందులో ఆరు వేల ఎలక్ట్రిక్ కార్లు, నాలుగు వేల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉన్నాయి.

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరుగుదల

హైదరాబాద్ : కార్బన్ ఉద్గారాలు విడుదల చేసే వాహనాల విక్రయంపై ప్రజలకు ఆసక్తి తగ్గుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కిందటి సంవత్సరంతో పోలిస్తే 2020 లో ఈ ఎనిమిది నెలల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 23 శాతం పెరిగాయి. రవాణా శాఖ వివరాల ప్రకారం ఈ నెల  ఆరవ తేదీ నాటికి 11 వేల ఎలక్ట్రిక్, బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు రోడ్డు మీదకు వచ్చాయి. ఇందులో ఆరు వేల ఎలక్ట్రిక్ కార్లు, నాలుగు వేల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉన్నాయి.


కాగా... 2019 లో ఇదే సమయంలో 9,303 వాహనాలు సేల్ అయ్యాయి. ఇందులో 5,573 ఎలక్ట్రిక్ కార్లు, 3,690 ఎలక్ట్రిక్ టూ వీలర్స్, 40 ఆర్టీసీ బస్సలు ఉన్నాయి. కరోనా మహమ్మారి నేపధ్యంలో అన్ని రంగాలతోపాటు ఆటోమొబైల్ రంగంలో కూడా విక్రయాలపై ప్రభావం పడిన విషయం తెలిసిందే. కాగా... ఎలక్ట్రిక్ వెహికిల్ సేల్స్ మాత్రం పెరిగాయి. 


మరోవైపు కార్బన్ ఉద్గారాల వాహనాల విక్రయాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్  వాహనాలపై కేంద్ర ప్రభుత్వం రాయితీలనందిస్తోంది. ప్రధానంగా ఈ-వాహనాలు కొనుగోలు చేస్తే వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) తగ్గింపు ఉంటుంది. దీనికి తోడు మిగతా వాహనాలతో పోలిస్తే కాస్త తక్కువ ఖర్చుతో వాహనాలను సొంతమవుతాయి. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2020-08-12T03:32:02+05:30 IST