చేతులెత్తే పద్ధతిలో మేయర్ ఎన్నిక
ABN , First Publish Date - 2020-12-06T08:10:56+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఘట్టంలో తుది అంకమైన మేయర్, డిప్యూటీ మేయర్ల

మొదటి సమావేశంలోనే ఎజెండా.. ఓటు హక్కున్న సభ్యులతో కోరం
సగం మంది హాజరు తప్పనిసరి
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఘట్టంలో తుది అంకమైన మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపికే మిగిలి ఉంది. హంగ్ నేపథ్యంలో.. చేతులెత్తే పద్ధతి ద్వారా జరిగే పరోక్ష ఎన్నికల్లో.. ఈ రెండు పదవులు ఎవరిని వరిస్తాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ఫిబ్రవరి 10 వరకు ఉన్నందున.. సాంకేతికంగా.. అప్పటి వరకు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం సాధ్యం కాదు. ప్రమాణ స్వీకారం తర్వాతే.. వీరికి మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునేందుకు ఓటుహక్కు వస్తుంది. ఇప్పుడున్న పాలకమండలి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే తప్ప.. కొత్తగా ఎన్నికైన వారు ఇప్పటికప్పుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం లేదు.
మేయర్ ఎన్నిక ఇలా..
ఎన్నికైన కార్పొరేటర్‌లను తొలుత సమావేశపరుస్తారు. దీనిపై సభ్యులందరికీ కనీసం మూడు రోజులు ముందు సమాచారం ఇస్తారు. సమావేశం ప్రారంభం కాగానే ప్రమాణ స్వీకారాల ఘట్టం ఉంటుంది. ఆ తర్వాత మేయర్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. చేతులెత్తే పద్ధతిలో మేయర్ ఎన్నిక జరుగుతుంది. విప్ వర్తిస్తుంది.
ఓటు హక్కున్న సభ్యుల్లో(కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియోలు) కనీసం సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లు. కోరం లేకుంటే.. మేయర్ ఎన్నికను తర్వాతి రోజుకు వాయిదా వేస్తారు. తర్వాతి రోజు కూడా కోరం లేకుంటే.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందజేస్తారు. మేయర్‌ను ఎన్నుకోకుండా.. డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించకూడదు.
కోరం లేని కారణంగా వరుసగా రెండు రోజులు సమావేశాలు వాయిదా పడితే.. తదుపరి ప్రత్యేక సమావేశం తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. ఈ సమావేశానికి కోరంతో సంబంధం ఉండదు. హాజరైన సభ్యులతోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. మేయర్ పదవికి రిజర్వేషన్ వర్తిస్తుంది. డిప్యూటీ మేయర్‌కు ఎలాంటి రిజర్వేషన్ లేదు.
నిర్ణీత గడువులోగా మేయర్ పదవికి ఒకే నామినేషన్ వస్తే.. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే.. ఓటు హక్కున్న సభ్యులతో చేతులెత్తే పద్దతిలో ఎన్నిక జరుపుతారు.
ఒకవేళ కోరం ఉంటే.. ప్రిసైడింగ్ అధికారి సమక్షంలో చేతులు ఎత్తే పద్ధతిలో మేయర్ ఎన్నిక జరుగుతుంది. పోటీలో ఉన్నవారికి వచ్చిన ఓట్లను లెక్కించి, విజేతను నిర్ణయిస్తారు.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే.. లాటరీ పద్ధతి ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
పార్టీల బలాబలాలిలా..
జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లు ఉండగా.. టీఆర్‌ఎస్-55, బీజేపీ-48, మజ్లిస్-44, కాంగ్రెస్-2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. నేరేడ్‌మెట్ ఫలితం పెండింగ్‌లో ఉంది. ఎక్స్-అఫిషియోలతో కలిపి పార్టీల బలాబలాలను పరిశీలిస్తే..
కాంగ్రె్‌సకు ఇద్దరు కార్పొరేటర్లు, ఒక ఎక్స్-అఫిషియోతో కలిపి మూడు ఓట్లు ఉంటాయి
బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్-అఫిషియోలతో కలిపి వారి బలం 51
మజ్లి్‌సకు 44 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్-అఫిషియోలతో కలిపి మొత్తం బలం 54
టీఆర్‌ఎ్‌సకు 55 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 35 మంది దాకా ఎక్స్-అఫిషియోల బలం సమకూరనుంది. దాంతో వారి బలం 90కి చేరుకుంటుంది.
సమీకరణలపై చర్చోపచర్చలు
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు జరిగే ఎన్నికలపై విభిన్న రకాల చర్చలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది సభ్యులున్న టీఆర్‌ఎ్‌సను అడ్డుకోవాలంటే.. బీజేపీకి మజ్లి్‌సతో కలవడం తప్ప మరోమార్గం లేదు. ఇది సాధ్యమయ్యేది కాదు. ఇద్దరు సభ్యులున్న కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నా.. సమీకరణల్లో ఎలాంటి మార్పు ఉండదు.
ఒకవేళ మేయర్ పదవి కోసం మజ్లిస్, టీఆర్‌ఎస్, బీజేపీలు అభ్యర్థులను నిలిపితే అప్పుడు టీఆర్‌ఎ్‌సదే విజయం. అంటే మజ్లిస్ లేదా బీజేపీలు ప్రత్యర్థుల సహకారం లేకుండా ఎన్నికవ్వడం సాధ్యం కాదు. టీఆర్‌ఎ్‌సను అడ్డుకోవడం మజ్లి్‌సకు మద్దతునివ్వడమన్నది బీజేపీకి సాఽఽధ్యపడదు. ఒకవేళ మేయర్ పదవిని మజ్లి్‌సకు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్ సిద్ధపడ్డా.. బీజేపీ తనకున్న బలంతో అడ్డుకోలేదు. సొంత బలంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు టీఆర్‌ఎ్‌సకు దక్కే అవకాశాలున్నా.. మజ్లి్‌సతో అవగాహన మేరకు పదవులను పంచుకునే చాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది.