బంజారాహిల్స్ డివిజన్‌లో బీజేపీ కార్యకర్తల నిరసన
ABN , First Publish Date - 2020-12-01T15:17:25+05:30 IST
గ్రేటర్లో ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. బంజారాహిల్స్ డివిజన్‌లో బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు

హైదరాబాద్: గ్రేటర్లో ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. బంజారాహిల్స్ డివిజన్‌లో బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాషాయ మాస్క్ లు ధరించిన పోలింగ్ ఏజెంట్లను, ఓటర్లను సైతం పోలింగ్ సిబ్బంది అడ్డుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాషాయ మాస్క్లు ధరిస్తే వారికి ఏంటీ ఇబ్బందంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్త పరిచారు. పోలింగ్ సిబ్బంది ఎందుకు లోపలికి అనుమతించడం లేదంటూ బీజేపీ కార్యకర్తలు పోలింగ్ ముందు ఆందోళన చేస్తున్నారు.