రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి

ABN , First Publish Date - 2020-12-06T08:02:41+05:30 IST

అగ్రిహబ్‌ ఫౌండేషన్‌తో 11 వ్యవసాయ అంకుర సంస్థలకు సంబంధించిన ఒప్పందాన్ని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర

రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి

వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు

అగ్రి హబ్‌ ఫౌండేషన్‌తో అవగాహణ ఒప్పందం

హైదరాబాద్‌/రాజేంద్రనగర్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): అగ్రిహబ్‌ ఫౌండేషన్‌తో 11 వ్యవసాయ అంకుర సంస్థలకు సంబంధించిన ఒప్పందాన్ని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం శనివారం  కుదుర్చుకుంది. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ డాక్టర్‌ వి. ప్రవీణ్‌రావు మాట్లాడుతూ  రైతుల ఆదాయం రెట్టింపుతో పాటు పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపులో వ్యవసాయ అంకుర సంస్థలు కీలకపాత్ర పోషించాలని అన్నారు. అవగాహన ఒప్పందం పత్రాలపై విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌ కుమార్‌, వివిధ అంకుర సంస్థల ప్రతినిఽధులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, అగ్రిహబ్‌ ఇన్‌చార్జీ డాక్టర్‌ కల్పనాశాస్త్రీ తదితరులు పాల్గొన్నారు. 


ఐకార్‌ ర్యాంకింగ్స్‌లో జయశంకర్‌ వర్సిటీకి పదో స్థానం

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌) 2019 సంవత్సరానికి ప్రకటించిన ర్యాంకుల్లో... ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం పదో స్థానంలో నిలిచింది. ర్యాంకుల జాబితాలో... 1, 2 స్థానాల్లో వరుసగా కర్నాల్‌లోని ఐకార్‌- నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, లూథియానాలోని పంజాబ్‌ అగ్రికల్చరల్‌ వర్సిటీ నిలిచాయి.


Updated Date - 2020-12-06T08:02:41+05:30 IST