పోలీస్ నోటిఫికేషన్‌పై ఎన్నికల ప్రభావం!
ABN , First Publish Date - 2020-12-19T07:17:56+05:30 IST
పోలీస్ జంబో నోటిఫికేషన్‌పై ఎన్నికల ప్రభావం పడనుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్న ప్రచారం మొదలైనప్పటినుంచి నిరుద్యోగులందరి దృష్టి పోలీస్ కొలువులపైనే పడింది. తెలంగాణ

ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాతే
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : పోలీస్ జంబో నోటిఫికేషన్‌పై ఎన్నికల ప్రభావం పడనుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్న ప్రచారం మొదలైనప్పటినుంచి నిరుద్యోగులందరి దృష్టి పోలీస్ కొలువులపైనే పడింది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎ్‌సఎల్‌పీఆర్‌బీ) ఉండటం వల్ల మిగతా ప్రభుత్వ ఉద్యోగాలకంటే ముందుగా ఈ నోటిఫికేషన్, ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని అంతా భావించారు. ఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో సుమారు 20 వేల పోస్టులకు నోటిఫికేషన్ రానుండటంతో ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు కసరత్తు మొదలుపెట్టారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన సమాచారం కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో వెతుకుతున్నారు.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో అవి ముగిసిన తర్వాతే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నోటిఫికేషన్ జారీ చేస్తే చట్టపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక మార్చిలో జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతే పోలీస్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
ఈలోగా నియామకాలకు ఆర్థికశాఖ ఆమోదం, జిల్లాలవారీగా ఖాళీల భర్తీకి జీఏడీ నుంచి క్లియరెన్స్ లభించే అవకాశం ఉంది. 2018లో 18 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలోనూ శాసనసభకు ముందస్తు ఎన్నికలు రావడంతో అప్పటికే ప్రారంభమైన నియామక ప్రక్రియ పూర్తికావడంలో కొంత జాప్యం జరిగింది.