సర్వమత సారాంశం ఒక్కటే

ABN , First Publish Date - 2020-12-26T05:05:11+05:30 IST

సర్వమత సారాంశం ఒక్కటే

సర్వమత సారాంశం ఒక్కటే
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మంత్రి దయాకర్‌ రావు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు, డిసెంబరు 25: సర్వమత సారాంశం ఒక్కటేనని.. మనుషులను ప్రేమించి, ఆదరించి ఆ దుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని శ్రీకృష్ణ మందిరం ఆలయ దశమ వార్షికోత్సవం సందర్భంగా హాజరై స్వామి సుందర చైతన్యానందుల జన్మదిన సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో సతీమణి ఉషాదయాకర్‌ రావుతో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఒకే చోట చేరి వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయం అన్నారు. ఆలయ ఆవరణలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాటిమీదగల రామాలయంలో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సుందర్‌ సత్సంగ్‌ అధ్యక్షుడు అనుమాండ్ల మోహన్‌ రెడ్డి, మాతృమండలి అధ్యక్షురాలు మాశెట్టి జమున రమేష్‌, పేర్ణ రఘుపతి, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బిజ్జాల అనిల్‌ కుమార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ రాంచంద్రయ్య, వైస్‌చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, ఎంపీపీ టీసీ అంజయ్య, జడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్‌, ఇమ్మడి రాంబాబు, నాయకులు పసుమర్తి సీతారాములు, బిందు శ్రీను, కౌన్సిలర్‌లు నట్వర్‌, శ్రీనివాస్‌, రేవతి శంకర్‌, నాయకులు రవి, శ్రవణ్‌, ఆలయ అర్చకులు వెన్నప్ప సంతోష్‌ శర్మ, కొల్లావజ్జుల రమేష్‌ శర్మ, శివశర్మ, క్రాంతి పాల్గొన్నారు.


Updated Date - 2020-12-26T05:05:11+05:30 IST