ఆన్‌లైన్ బెట్టింగ్‌పై ఈడీ దృష్టి

ABN , First Publish Date - 2020-08-20T21:59:01+05:30 IST

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై ఈడీ దృష్టి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్న చైనా కంపెనీలపై ..

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై ఈడీ దృష్టి

హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్‌పై ఈడీ దృష్టి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్న చైనా కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. రూ. 11 వందల కోట్లను అక్రమంగా దేశ ప్రజల నుంచి కాజేసిన చైనా కంపెనీలపై కేసు నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఆన్ లైన్ బెట్టింగ్ స్కాంపై విచారణ ముమ్మరం చేసింది. సమగ్ర దర్యాప్తుకు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు.


ఆన్ లైన్‌లో చైనా కంపెనీలు పెద్ద ఎత్తున బెట్టింగులు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా కలర్ ప్రిడిక్షన్ పేరుతో ఈ గేమ్స్ ఏర్పాటు చేశాయి. ముందుగా చిన్న మొత్తంలో డబ్బులు కట్టించుకుని.. తర్వాత పెద్ద మొత్తంలో కొల్లగొడుతున్నారు. దీనిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైనాకు చెందిన వ్యక్తితోపాటు ఇద్దరు భారతీయులను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-08-20T21:59:01+05:30 IST