జగన్‌పై ఈడీ కేసులు

ABN , First Publish Date - 2020-11-26T08:35:00+05:30 IST

జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి అరబిందో, హెట్రో సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 2016లో నమోదుచేసిన

జగన్‌పై ఈడీ కేసులు

సీబీఐ కోర్టుకు బదిలీ చేయండి

 నాంపల్లి సెషన్స్‌ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు 

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి అరబిందో, హెట్రో సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 2016లో నమోదుచేసిన కేసులను సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి (ఎంఎ్‌సజే) కోర్టును హైకోర్టు ఆదేశించింది. జగన్‌ సంస్థల్లో క్విడ్‌ ప్రో కో కింద పెట్టుబడులు పెట్టారనే అభియోగాలపై ఈ రెండు సంస్థలతో పాటు జగతి పబ్లికేషన్స్‌పై కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. జగతి పబ్లికేషన్స్‌పై ఉన్న కేసులు సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యాయి.


అయితే అరబిందో, హెట్రో సంస్థలపై కేసులపై మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులోనే విచారణ సాగుతోంది. ్జకాగా, ఒకే నేరాభియోగంపై ఈడీ, సీబీఐ కోర్టుల్లో సమాంతర విచారణ చేపట్టడం సీఆర్‌పీసీ నిబంధనలకు వ్యతిరేకమని భారతి సిమెంట్స్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసినందున సీబీఐ నమోదు చేసిన కేసులను విచారించిన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేయాలని కోరుతూ భారతి సిమెంట్స్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌. మధుసూదన్‌రావు బుధవారం విచారించారు.


పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సీబీఐ కేసులు తేలిన తర్వాతే ఈడీ కేసులు విచారించాలన్నారు.మరో నిందితుడు శామ్యూల్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించేందుకు గడువు కోరారు. దీంతో ఈ వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ర్యాంకీ, వాన్‌పిక్‌లపై నమోదైన కేసులు గురువారం విచారణకు రానున్నాయి. ఓబుళాపురం మైనింగ్‌ కేసుల్లో మెఫజ్‌ అలీఖాన్‌, కృపానందం దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటిషన్లపై విచారణ డిసెంబరు 1కి వాయిదా పడింది.


Updated Date - 2020-11-26T08:35:00+05:30 IST