జీహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణ పై ఉన్నతస్థాయి సమావేశం
ABN , First Publish Date - 2020-09-19T00:10:23+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్మున్సిపల్కార్పొరేషన్కు నిర్ణీత సమయంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలుచేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో గ్రేటర్ ఎన్నికలు జరిగాయి.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్మున్సిపల్కార్పొరేషన్కు నిర్ణీత సమయంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలుచేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో గ్రేటర్ ఎన్నికలు జరిగాయి. కాగా 2021, ఫిబ్రవరి 10వ తేదీతో కాల పరిమితి పూర్తవుతుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధి శుక్రవారం ఉన్నతాధికారులతో ప్రత్యేకసమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి జీహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్‌కుమార్, జీహెచ్ఎంసి ఎన్నికల అధికారి జ్యోతిబుద్ధ ప్రకాశ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈసమావేశంలో కమిషనర్ పార్ధసారధి పలు అంశాలపై మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, అనుసరరించాల్సిన విధానాలను చర్చించారు.
ప్రభుత్వం, జీహెచ్ఎంసి మధ్య ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వనుంది. ఎన్నికలకు సంబంధించి యాక్షన్‌ప్లాన్‌ను సిద్దం చేసుకోవాలని, ఆయా జోనల్ నుంచి సర్కిళ్ల స్థాయిలో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, టీపోల్‌అప్లికేషన్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిద్దం చేసిన ఎలక్షన్‌రోల్స్, ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సనల్, ఎలక్షన్ ప్రాసెస్‌ను సిద్దం చేసుకోవాలని కూడా సూచించారు.
ఎన్నికల ప్రక్రియలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే వ్యయాన్ని తగ్గించుకోవాలని, పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌శశాతం 45.29 మాత్రమే జరిగింది. కానీ ఈసారి పోలింగ్‌శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. దీనికి సంబంధించి ఒక యాక్షన్‌ప్లాన్‌ను సిద్ధం చేయాలని అన్నారు. ఓటర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాలుచేపట్టాలని సూచించారు. ఇందులో స్వచ్చంద సంస్థలు, ఆర్‌డబ్బ్యూఎ, ఇతర పౌర సంస్థలను భాగస్వాములను చేయాలని కమిషనర్ ఆదేశించారు. కోవిడ్-19 నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.
భారత ఎన్నికల కమిషన్ఇచ్చిన మార్గదర్శకాలను ఈ ఎన్నికల్లో అమలుచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పద్దతిని అమలుచేయాలా? లేక ఎలక్ర్టానిక్ ఓటింగ్ పద్దతిని అనుసరించాలా? అన్నది కూడా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ అంశంపై తిరిగి అక్టోబరు 2న మరోసారి జోనల్‌కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సమావేవం నిర్వహించనున్నట్టుతెలిపారు. ఈ సమావేవం తర్వాత జీహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణపై ఒక యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించాలని నిర్ణయించారు.