తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఆపండి: హైకోర్టు

ABN , First Publish Date - 2020-10-29T02:48:39+05:30 IST

కోవిడ్ కారణంగా కనీస మార్కులు 35తో విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసింది. ఎంసెట్ నిబంధనల ప్రకారం వార్షిక పరీక్షలలో 45 శాతం మార్కులు తప్పనిసరిగా ...

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఆపండి: హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ఆపాలని జేఎన్టీయూను హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ కారణంగా కనీస మార్కులు 35తో విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసింది. ఎంసెట్ నిబంధనల ప్రకారం వార్షిక పరీక్షలలో 45 శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఎంసెట్ అర్హత కోల్పోయారు. అయితే బాధిత విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వ వాదనలను వినింది. ఎంసెట్‌ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సెలింగ్ ఆపాలని హైకోర్టు ఆదేశించింది. 


Updated Date - 2020-10-29T02:48:39+05:30 IST