యూపీలో చిక్కుకున్న డ్వాక్రా మహిళలు

ABN , First Publish Date - 2020-03-24T10:18:39+05:30 IST

స్వయం సహాయక గ్రూపుల ఏర్పాటుపై ఉత్తరప్రదేశ్‌ మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు గత నెల 4న వెళ్లిన 250 మంది తెలంగాణ డ్వాక్రా సంఘాల

యూపీలో చిక్కుకున్న డ్వాక్రా మహిళలు

వరంగల్‌ అర్బన్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్వయం సహాయక గ్రూపుల ఏర్పాటుపై ఉత్తరప్రదేశ్‌ మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు గత నెల 4న వెళ్లిన 250 మంది తెలంగాణ డ్వాక్రా సంఘాల సభ్యులు అక్కడే చిక్కుకుపోయారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రైళ్లు, బస్సులు, విమానయాన సర్వీసులు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో వాళ్లు స్వరాష్ట్రానికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో వాళ్లు ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్‌ చేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తెలంగాణకు ఏ విధంగా చేరుకోవాలో అర్థం కావడం లేదని వాపోయారు. తమకు మాస్క్‌లు, శానిటైజర్‌లు కూడా అందుబాటులో లేవని చెప్పారు. సీఎం కేసీఆర్‌ చొరవ చూపి తాము రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాట్లు చేయించాలని వేడుకుంటున్నారు.

Read more