అక్టోబరు 25న దసరా..తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య

ABN , First Publish Date - 2020-09-12T09:23:55+05:30 IST

దసరా పండుగను అక్టోబరు 25న జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్‌మోహన్‌రావు

అక్టోబరు 25న దసరా..తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య

కాజీపేట, సెప్టెంబరు 11: దసరా పండుగను అక్టోబరు 25న జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్‌మోహన్‌రావు తెలిపారు. ఈ ఏడాది అధిక మాసం వచ్చినందున పండుగ తేదీల్లో ప్రజలు గందరగోళం కావొద్దని సమాఖ్య నిర్ణయించిందన్నారు. కాజీపేటలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జగన్‌మోహన్‌రావు పండుగ తేదీలను వెల్లడించారు. సెప్టెంబరు 17న పెతర అమావాస్య(పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు), అక్టోబరు 16న బతుకమ్మ, 24న సద్దుల బతుకమ్మ, 25న దసరా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఐనవోలు ప్రవీణ్‌కుమార్‌ శర్మ, జిల్లా ఉపాధ్యక్షుడు జాగర్లపూడి శ్రీనివాస్‌ శర్మ, సభ్యులు ఉడుతల శ్రీనివాస్‌ శర్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-12T09:23:55+05:30 IST