కమిషనరేట్‌ కార్యాలయంలో ఆయుధ పూజ

ABN , First Publish Date - 2020-10-27T11:23:32+05:30 IST

దసరా పర్వదినం సందర్భంగా వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఆయుధ పూజను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

కమిషనరేట్‌ కార్యాలయంలో ఆయుధ పూజ

వరంగల్‌ అర్బన్‌ క్రైం, అక్టోబరు 26: దసరా పర్వదినం సందర్భంగా వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఆయుధ పూజను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్‌ పరేడ్‌ గ్రౌడ్స్‌ సమీపంలోని ఆర్డ్మ్‌ రిజర్వ్‌, ఎంటీ విభాగాల కార్యాలయాల్లో జరిగిన ఆయుధ పూజల్లో వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయుధాలకు (తుపాకులు) కంకనాలు కట్టి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పూజలు చేశారు.  అనంతరం శమీ (జమ్మి) వృక్షానికి పూజలు చేసి పోలీసు సిబ్బందికి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో సెంట్రల్‌జోన్‌ ఇన్‌చార్జి డీసీపీ పుష్ప, అదనపు డీసీపీలు పాక గిరిరాజు, భీంరావు, ఏసీపీలు సదానందం, గంగాధర్‌రావు, ఆర్‌ఐలు భాస్కర్‌, సెట్టి శ్రీనివాస్‌రావు, నగేశ్‌ పాటు పోలీసు అధికారుల సంఘం నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T11:23:32+05:30 IST