గవర్నర్‌తో రఘునందన్ అరగంట పాటు భేటీ
ABN , First Publish Date - 2020-12-30T12:16:27+05:30 IST
గవర్నర్‌తో రఘునందన్ అరగంట పాటు భేటీ

హైదరాబాద్ : దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. మర్యాదపూర్వకంగానే గవర్నర్‌తో సమావేశమయినట్లు రఘునందన్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని ఆమె దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే చెప్పారు.